ఈ మొక్కలను ఇంటి దగ్గర పెంచుకుంటే కష్టాలు తప్పవట!

చాలా మంది తమ ఇంటికి దగ్గర్లో, ఇంటి లోపల కొన్ని మొక్కలను పెంచుతుంటారు. అలంకరణ కోసం, మంచి జరుగుతుందనే నమ్మకంతో పెంచుతారు.

కొన్ని మొక్కలను ఇంటి దగ్గర పెంచకూడదట. అవి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయట. వాటిని పెంచడం మంచిది కాదట.

చాలా మంది ఇళ్లలో బోన్సాయ్ మొక్కలను పెంచుతుంటారు. అవి అందంగా ఉంటాయి. కానీ, నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయట.

కొందరు ఇంటి పరిసరాల్లో పత్తి మొక్కలను పెంచుతుంటారు. అయితే పత్తి మొక్కలను ఇళ్లలో పెంచడం శుభసూచకం కాదట.

భారీ ముళ్లను కలిగి ఉండే బ్రహ్మజెముడు వంటి ఎడారి మొక్కలను ఇళ్లలో ఉంచకూడదట. ఇవి కూడా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయట.

చింత మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచడం మంచిది కాదని కొందరు భావిస్తారు. ఇవి చెడు శక్తిని ఆహ్వానిస్తాయట.

తుమ్మ మొక్క వైద్య పరంగా చాలా ఉపయోగాలను అందిస్తుంది. అయితే దానికి ఉండే ముళ్ల కారణంగా దానిని దుష్ట మొక్కగా భావిస్తారు.

ఐవీ మొక్క విషపూరితమైదని భావిస్తారు. దీనిని ఇంట్లో పెంచితే పిల్లలకు, పెంపుడు జంతువులకు మంచిది కాదట.