ఈ కారణాల వల్ల పెళ్ళిళ్లు చేసుకోకండి.. వివాహ బంధం నిలబడదు..!

ఒత్తిడి.. అందరికీ పెళ్ళిళ్లు అవుతున్నాయి మాకు కావడం లేదు అనే ఒత్తిడిలో పెళ్ళి చేసుకోవడం కంటే.. అసలు పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది.  

త్యాగాలు.. పెళ్లి కోసం కెరీర్,  ఉద్యోగం,  అభిరుచులు వంటివి వదులుకునే డిమాండ్స్ ఉంటే సున్నితంగా ఆ పెళ్లిని తిరస్కరించడం మేలు.

నియంత్రణ.. వైవాహిక జీవితంలో పవర్ గేమ్ ఎప్పుడూ ఆరోగ్యకరం కాదు. భార్య,  భర్త.. పెద్ద,  చిన్న అనే కారణాలతో ఒకరిని నియంత్రించే మైండ్సెట్ తో పెళ్లి చేసుకోకూడదు.

లైట్ తీసుకోవద్దు.. భాగస్వామి మంచివారైనా లైఫ్ పార్ట్నర్ ను పట్టించుకోకపోతే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి వారు పెళ్లి చేసుకోకపోవడం మంచిది. 

పాత విషయాలు.. భాగస్వామికి గతంలో పాత సంబంధాలు ఉంటే వాటి గురించి ప్రశ్నించకూడదనే ఆలోచన ఉంటేనే పెళ్లి చేసుకోవాలి.  లేకపోతే ప్రస్తుత బంధం చెడిపోతుంది.

దాపరికం.. జీవిత భాగస్వామి వద్ద ఏ విషయాన్ని అయినా సరే దాచిపెట్టే  ఆలోచన ఉంటే పెళ్లి చేసుకోకండి. ఇది  నమ్మకాన్ని పోగొట్టి, అపార్థాలను సృష్టిస్తుంది.

అసూయ.. భాగస్వామి విజయాలను చూసి అసూయ పడేవారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు.

స్నేహం.. భాగస్వామితో స్నేహంగా ఉండే ఆలోచన ఉంటేనే పెళ్లికి సిద్దం కావాలి. ఇద్దరి మధ్య స్నేహం వైవాహిక బంధాన్ని మరింత బలపరుస్తుంది.

కుటుంబం.. ఇద్దరు వ్యక్తులే కాదు.. రెండు కుటుంబాలు కూడా ముఖ్యమే.. ఒకరి కుటుంబాన్ని మరొకరు తమదిగా భావించాలి. కుటుంబాలను కలుపుకునే ఉద్దేశ్యం లేకుంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు.