జాగ్రత్త.. గ్రీన్ టీతో పాటు వీటిని అస్సలు తీసుకోకండి..
బచ్చలికూర, పాలకూర, ఇతర ఆకుకూరల ద్వారా శరీరానికి ఐరన్ అందుతుంది. వీటిని తిన్న వెంటనే గ్రీన్ టీ తాగితే ఐరన్ శోషణ పూర్తిగా జరగదు.
గుడ్లు తిన్న తర్వాత గ్రీన్ టీ తీసుకోకూడదు. గుడ్ల నుంచి అందే ప్రోటీన్లను గ్రీన్ టీ వల్ల శరీరం సరిగ్గా శోషించుకోలేదు.
గ్రీన్ టీలో పంచదార కలుపుకుని తాగితే ప్రయోజనం ఉండదు. గ్రీన్ టీలోని యాంటీ-ఆక్సిడెంట్లను పంచదార నాశనం చేస్తుంది.
గ్రీన్ టీలో పాలు, పాల పదార్థాలను కలపకూడదు. గ్రీన్ టీలోని కెటాచిన్స్ ప్రభావాన్ని డెయిరీ ప్రోడక్ట్స్ తగ్గిస్తాయి.
గ్రీన్ టీ తాగిన గంట వరకు అన్నం తినకూడదు. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు అయిన టానిన్స్ కార్బోహైడ్రేట్లను త్వరగా జీర్ణం కానివ్వవు. ఫలితంగా గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం మొదలవుతాయి.
బీన్స్ తిన్న తర్వాత గ్రీన్ టీ తాగకూడదు. బీన్స్ ద్వారా లభించే ఐరన్ శోషణం కాకుండా గ్రీన్ టీ నియంత్రిస్తుంది.
గ్రీన్ టీ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. గ్రీన్ టీ తాగిన వెంటనే బాగా స్పైసీ ఫుడ్స్ తింటే యాసిడ్ రిఫ్లెక్స్ మొదలవుతుంది.
గ్రీన్ టీతో పాటు మాంసం తినకూడదు. మాంసంలోని ప్రోటీన్లు శోషణం కాకుండా గ్రీన్ టీ నియంత్రిస్తుంది.