చలేస్తోందని మందేస్తున్నారా.?

ఈ చల్లదనానికి కాస్త పెగ్గు వేస్తే బాగుంటుందని మందుబాబులు అనుకుంటూ ఉంటారు. అయితే వారికి ఓ హెచ్చరిక ఇచ్చారు వైద్య నిపుణులు. అదేంటంటే..

 చాలా మంది సాయంత్రం వేళ చలి తగిలిన తర్వాత మందు తాగే అలవాటు ఉన్నావారు రెగ్యులర్ గా చలి బారినుంచి తప్పించుకోవచ్చని ఎక్కువగా తాగుతుంటారు

 ఇలా తాగడం వల్ల ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు డాక్టర్లు. శ్వాస కోశ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు

 ఆల్కహాల్ కారణంగా చలికి రక్తం గడ్డకట్టడం జరుగుతుంది.. 

 అంతేకాదు గుండెకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు..

ఆల్కహాల్ కొంత సమయం పాటు శరీరాన్ని వెచ్చగా ఉంచినా, ఆ తర్వాత ఒక్కసారిగా శరీరం చల్లబడిపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి..