అతిగా నీరు తాగుతున్నారా..

నీరు అతిగా తాగితే వాటర్ ఇంటాక్సికేషన్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అధికంగా చేరే నీరుతో శరీరంలోని ద్రవాలు పలచబడి ఫ్ల్యూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది

 ఇది అంతిమంగా కోమా, మరణానికి కూడా దారి తీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 వైద్యులు చెప్పే దాని ప్రకారం, కిడ్నీలు గంటకు 0.8 నుంచి ఒక లీటర్ నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. 

అంతకుమించి నీరు తాగితే నీరు పేరుకుని వివిధ శారీరక ద్రవాల సాంద్రత తగ్గుతుంది. 

దీనితో పాటు పలుమార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం, మూత్రం రంగు పల్చబడటం వంటివి కూడా వాటర్ ఇంటాక్సికేషన్‌ను సూచిస్తాయి.

పురుషులు రోజుకు గరిష్ఠంగా 3.7 లీటర్ల నీరు తాగాలి. మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీరు తాగాలి

పొడి వాతావరణంలో ఉండే వారు, చెమట ఎక్కువగా పట్టేవారికి ఇంతకంటే ఎక్కువ నీరు అవసరం పడొచ్చని వైద్యులు చెబుతున్నారు.