ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్.. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు

రోడ్డు ప్రమాదాలు, మరణాలపై ప్రభుత్వ డేటా కీలక విషయాలను వెల్లడించింది

ఈ క్రమంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడకం వల్లే ఈ ప్రాంతాల్లో మరణాలు ఎక్కువ అని వెల్లడి

తమిళనాడు, లడఖ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో ఈ ప్రమాద మరణాలు ఎక్కువగా నమోదు

ఐఐటీ ఢిల్లీలోని ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇంజురీ ప్రివెన్షన్ సెంటర్ సర్వే వెల్లడి

2021లో 56 వేల రోడ్డు ప్రమాద మరణాలు సంభవించగా, 2022లో ఈసంఖ్య 61,038కు చేరింది

2022లో వేగం కారణంగా 45,928 మరణాలు నమోదు, రాంగ్ డ్రైవింగ్ కారణంగా 3,544 మంది మృతి

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 1,503 మరణాలు నమోదు

మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ వల్ల 1,132 మరణాలు రికార్డు

రెడ్ లైట్ జంపింగ్ వల్ల 271 మరణాలు, ఇతర కారణాల వల్ల 8,660 మరణాలు రికార్డు

ఇక ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణం