డ్రై ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్నింటిని పొద్దున్న పరగడుపున తినకూడదని అనుభవజ్ఞులు చెబుతున్నారు. 

పీచు పదార్థం అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఉదయం పూట పరగడుపున తినడం మంచిది కాదట

చెక్కరలు, పీచు పదార్థం అధికంగా ఉండే ఎండుద్రాక్ష ఉదయాన్నే పరగడుపున తింటే కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. 

అత్తిపళ్లను కూడా పరగడుపున తినకూడదు. కడుపులో మరో పదార్థం లేని సమయంలో పీచు పదార్థం సులభంగా జీర్ణం కాదు

విరోచనకారిగా పేరున్న అల్‌బుఖారా పళ్లల్లోనూ పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు మోషన్స్ వస్తాయి.

ఖర్జూరాల్లోనూ పీచు పదార్థం అధికం. ఇవి తొందరగా అరగవు కాబట్టి పరగడుపున తినకుండా ఉండటమే బెటర్

కొవ్వులు అధికంగా ఉండే బాదం పప్పులను కూడా ఉదయం పూట తినకూడదు

కాబట్టి, ఈ బరువైన ఆహారాలను ఇతర ఫుడ్స్‌తో కలిపి తీసుకోవడమే ఆరోగ్యానికి మేలని నిపుణులు చెబుతున్నారు. 

అయితే, వీటిని నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందట.