కార్బన్‌ డైఆక్సైడ్‌ని దాదాపు -80 డిగ్రీల దగ్గర చల్లబరిచినప్పుడు ఈ డ్రై ఐస్‌ ఏర్పడుతుంది

ఐస్‌క్రీముల్లాంటివి కరిగిపోకుండా ఉండేందుకు దీన్ని వాడతారు

దీనిని వైద్యం, ఆహారం, పానీయాలు, పరిశోధనా పరిశ్రమల్లో ఎక్కువగా వినియోగిస్తారు

అయితే దీన్ని పొరపాటున నోట్లో వేసుకుంటే, ఒంట్లోని ఆక్సిజన్‌ని ఆవిరి చేసేస్తుంది

అంతేకాదు నోరు, జీర్ణాశయం మార్గాన్ని కూడా దెబ్బతీస్తుంది

డ్రై ఐస్‌ చర్మానికి తగిలితే, కాలిపోయినట్లుగా గాయాలవుతాయి

దీని ఆవిరి తగిలినా కూడా దద్దుర్లు, కళ్ల మంటలు వస్తాయి

కాబట్టి సరదాగా కూడా ఈ డ్రై ఐస్‌ జోలికి పోవద్దని నిపుణుల హెచ్చరిక

చేతులకు గ్లవ్స్‌, కళ్లకు గాగుల్స్‌ లేకుండా పొరపాటున దీన్ని తాకకూడదని సూచన

మొన్న గురుగ్రామ్‌లోని ఓ రెస్టారెంట్లో, భోజనం తర్వాత డెజర్ట్‌ అనుకుని డ్రైఐస్‌ నోట్లో వేసుకున్న అయిదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు