స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి..!
ఒత్తిడి ఎక్కువైనపుడు అడ్రినలిన్ గ్రంథుల నుంచి కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. కార్టిసాల్ విడుదల ఎక్కువైనా, తక్కువైనా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
అవసరమైన దాని కంటే ఎక్కువ స్థాయిలో కార్టిసాల్ విడుదలైతే ఊబకాయం మొదలవుతుంది. వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ మొదలైనవి కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.
డార్క్ చాక్లెట్‌లో యాంటీ-ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కార్టిసాల్ ఉత్పత్తిని నియంత్రణలో ఉంచుతాయి.
పొటాషియంను అధికంగా కలిగి ఉండే అరటి పళ్లు అడ్రినలిన్ గ్రంథుల పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. కార్టిసాల్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తాయి.
సాల్మన్, మకేరల్ చేపల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కూడా కార్టిసాల్ విడుదలను బ్యాలెన్స్ చేస్తాయి.
కార్టిసాల్ అధికంగా విడుదల కావడం వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. బెర్రీ పళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నియంత్రిస్తాయి.
గ్రీన్ టీలో ఉండే L-థియానిన్ అనే అమినో యాసిడ్ శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. ఫలితంగా కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది.
ఫైబర్ స్థాయులను ఎక్కువగా కలిగి ఉండే ఓట్స్ కూడా కార్టిసాల్ ఉత్పత్తిని నియంత్రించగలవు.
బాదం, ఇతర వాల్ నట్స్‌లో విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి కార్టిసాల్ ఉత్పత్తి సమతూకంగా ఉండేలా చూస్తాయి.
నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ ఫలాల్లో ఉండే సీ విటమిన్ కూడా కార్టిసాల్ ఎఫెక్ట్‌ను తగ్గిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తుంది.