అందమైన చర్మం కోసం
ఇవి తినండి!
విటమిన్ –ఎ అధికంగా ఉండే క్యారెట్స్ తినడం వల్ల కళ్లు, చర్మానికి చాలా మంచిది. వీటిని రోజూ తినడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
విటమిన్– ఎ, బీటా కెరటిన్‌లు పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తాయి.
క్యారెట్, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్స్, అవకాడో హార్మోన్లలోని తేడాల వల్ల వచ్చే మొటిమలను నివారిస్తాయి.
బొప్పాయిలో విటమిన్– సి, ఇ , బీటాకెరోటిన్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మంపైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ దూరమై అందంగా మారతారు.
టొమాటోలో విటమిన్– ఎ, కె, బి1, బి3, బి5, బి6, బి7 ఫుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి
యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే డార్క్చాక్లెట్స్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
చేపలు, సోయా ఉత్పత్తు ల్లో ఒమెగా– 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం తాజాగా నిగనిగలాడుతుంటుంది.
Related Web Stories
చదివింది గుర్తుండాలంటే.. ఈ చిట్కాలను పాటించండి చాలు..
యువతలో గుండె జబ్బులు పెరగడానికి కారణాలు
మనుషులు ఉంటున్న చల్లని ప్రాంతం ఇదే..
వామ్మో.. బంగాళదుంపలతో ఇలాంటి ఉపయోగాలూ ఉన్నాయా!