ఈ శాకాహార ఆహారాలు తింటే చాలు.. ఆయుష్షు ఫుల్..!

కొన్ని శాకాహార ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి,  దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి ఆయుష్షును పెంచుతాయి.

నట్స్(గింజలు) ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆమ్లాలు,  ఫైబర్,  యంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే నట్స్ రోజూ తింటే దీర్ఘాయువును పెంచుతాయి.

సీడ్స్(విత్తనాలు) అవిసె గింజలు,  చియా గింజలు,  పొద్దు తిరుగుడు విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు,  ఫైబర్,  మినరల్స్ ఉంటాయి.  ఇవి గుండెకు మేలు చేస్తాయి.

ధాన్యాలు.. క్వినోవా,  బ్రౌన్ రైస్,  తృణధాన్యాలలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి.  రక్తంలో చక్కెర నియంత్రణ,  జీర్ణక్రియ,  గుండె జబ్బులు, స్థూలకాయం,  టైప్-2 డయాబెటిస్ ప్రమాదాలు తగ్గిస్తాయి.

ఆకుకూరలు.. పాలకూర,  బచ్చలికూర,  బ్రోకలీ వంటి ఆకుపచ్ కూరగాయలలో పోషకాలు ఎక్కువ.  ఎముకల ఆరోగ్యానికి,  గుండె జబ్బులు తగ్గించడంలో తోడ్పడతాయి.

గ్రీన్ టీ.. గ్రీన్ టీలో   కాటెచిన్లు,  యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. మెదడు పనితీరును మెరుగుపరిచి శరీరంలో ఫ్యాట్ బర్న్ చేయడంలో సహాయపడతుంది.

మొక్కల ఆధారిత ఆహారాలు.. మొక్కల  ఆధారిత ఆహారాలలో పోషకాలు సమృద్దిగా పుష్కలంగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.