దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!

కోడి గుడ్లు, కార్న్ ఫ్లోర్, మైదాపిండి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్.

 ముందుగా గుడ్లను ఉడికించి పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 

 ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసి కలుపుకోవాలి. 

 మరోవైపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోండి. ఇప్పుడు మైదా పిండి మిశ్రమంలో ముంచి ఆయిల్‌లో వేసి ఫ్రై చేయండి

మీడియం మంట మీద వేయిస్తే.. నాలుగు వైపులా చక్కగా వేగుతాయి. లేదంటే సరిగా ఉడకకుండా మాడిపోతుంది. ఇవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి.

 ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చి మిర్చి, వెల్లుల్లి వేయించి ఈ వేయించి గుడ్లను అందులో వేసి బాగా ఫ్రై చేయండి. 

వీటిని టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీ, మయోనీస్ తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఈజీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.