93b460dd-e25f-4285-b565-616da9eb32c1-11_11zon (1).jpg

కోడిగుడ్డు పచ్చడి..  ఇలా చేస్తే టేస్ట్ వేరెలెవల్

baa31776-b840-4afc-a25a-228881c35e91-4_11zon.jpg

కావలసినవి: కోడిగుడ్లు - మూడు(ఉడికించినవి), గరంమసాలా - రెండు టేబుల్‌స్పూన్లు, మెంతి పొడి - ఒక టీస్పూన్‌,

ca295578-de85-47e7-bf06-b6ebf292f39f-9_11zon.jpg

ఆవ పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌, ఉప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు,

a0ecb16d-67ce-489c-b4f7-2a2dcd4a7148-6_11zon.jpg

కరివేపాకు - కొద్దిగా, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా. 

ఉడికించిన గుడ్లను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

 స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. 

తరువాత ఉడికించిన గుడ్లమీద కత్తితో గాట్లు పెట్టి అందులో వేయాలి. చిన్నమంటపై వేగించాలి.

కోడిగుడ్లు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి.

గరంమసాలా, ఉప్పు, కారం వేసి మరి కాసేపు వేగనివ్వాలి. చివరగా కరివేపాకు వేసి దింపాలి. 

మిశ్రమం చల్లారిన తరువాత ఆవాల పొడి, మెంతి పొడి వేయాలి. కొత్తిమీర వేసుకోవాలి. 

నిమ్మరసం పిండుకొని కలపాలి. అంతే..  కోడిగుడ్డు పచ్చడి రెడీ.

అన్నంలోకి, చపాతీలోకి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.