ఐస్‌క్యూబ్స్‌తో  అందానికి మెరుగు..!

ఐస్‌క్యూబ్స్‌తో చర్మానికి  సరికొత్త అందాన్ని  తీసుకురావచ్చు. చర్మం,  మెడ మీద ఉండే  నొప్పులు తగ్గిపోతాయి.

దీంతో పాటు నలుపు  మచ్చలు, పేరుకున్న  మట్టి తొలగిపోతాయి. 

ఒక బౌల్‌లో నీళ్లు తీసుకుని  అందులో తులసి ఆకుల్ని  నలిపి వేయాలి. ఆ తర్వాత  రెండు స్పూన్ల అలొవెరా  జెల్‌ను వేసి బాగా కలపాలి.

ఆ నీటిని ఐస్‌క్యూబ్స్‌  ట్రేలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఈ ఐస్‌క్యూబ్స్‌తో చర్మాన్ని  రుద్దితే ముఖం మీద  నొప్పులతో పాటు వేడివల్ల  వచ్చిన మచ్చలు పోతాయి.

ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో ఒక కప్పు  రోజ్‌వాటర్‌తో పాటు కప్పు  మంచి నీళ్లు కలపాలి.

ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా  చర్మంపై రుద్దితే  ముడతలు తగ్గిపోతాయి. 

పసుపు, రోజ్‌ వాటర్‌తో  ఐస్‌క్యూబ్స్‌ తయారు చేసుకుని  ముఖం మీద మసాజ్‌  చేసినట్లు రుద్దితే పిగ్మెంటేషన్‌తో  పాటు కళ్ల కింద  మచ్చలు తగ్గిపోతాయి.