రోజు తక్కువ మద్యం తీసుకున్నా కూడా ప్రమాదామా

ప్రతిరోజు పలువురు తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ తీసుకుంటారు

అలా కొద్దిగా తాగడం వల్ల ఎలాంటి హాని జరగదని వారు నమ్ముతుంటారు

కానీ ఓ పరిశోధనలో మితంగా మద్యం సేవించడం కూడా డేంజర్ అని తేలింది

బ్రిటన్‌లో 60 ఏళ్లు పైబడిన వారిలో క్యాన్సర్ మరణాలు పెరగడానికి తక్కువ ఆల్కహాల్ తీసుకోవడమేనని పరిశోధకులు అన్నారు

60 ఏళ్ల పైబడిన 1,35,103 మంది పెద్దలను 12 ఏళ్ల పాటు పర్యవేక్షించి ఈ విషయాన్ని వెల్లడించారు

ఈ క్రమంలో మితంగా మద్యం సేవించడం గుండెకు మంచిదనే దీర్ఘకాల నమ్మకాన్ని తోసిపుచ్చింది

ఈ అంశం గురించి JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించారు

ఆల్కహాల్ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని చేసిన పరిశోధనలు లోపభూయిష్టంగా ఉన్నాయని వెల్లడించారు

అమెరికా ఆహార మార్గదర్శకాలు ఎక్కువగా తాగడం కంటే తక్కువ తాగడం ఆరోగ్యానికి మేలు అని పేర్కొంటున్నాయి