బ్రిస్క్ వాకింగ్ గురించి  ఎప్పుడైనా విన్నారా...

ఈ తరహా నడకలో మనం సాధారణ నడక కంటే కొంచెం వేగంగా నడవాలి.

ఒక వ్యక్తి గంటలో 3 మైళ్లు లేదా నిమిషానికి 100 అడుగులు నడవాలి.

 ఈ సమయంలో హృదయ స్పందన నిమిషానికి 110 నుండి 120 బీట్లకు వెళుతుంది.

రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.

ప్రతిరోజూ బ్రిస్క్ వాక్ చేస్తే గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

 వారానికి 5 సార్లు 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేస్తే బరువు అదుపులో ఉంటుంది. 

బ్రిస్క్ వాకింగ్ ప్రారంభించే ముందు, మీరు ధరించే బూట్లు సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి