చింతచిగురు బోటి..
ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది..
కావలసిన పదార్థాలు : బోటి - అరకేజీ, చింతచిగురు - కొద్దిగా, ఉల్లిపాయలు - రెండు, ఉప్పు - రుచికి తగినంత,
నూనె - మూడు టీస్పూన్లు, కారం - టీస్పూన్, పసుపు - కొద్దిగా, పచ్చిమిర్చి - నాలుగు, గరంమసాల - టీస్పూన్,
కరివేపాకు - కట్ట, కొత్తిమీర - కట్ట, అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్.
ముందుగా కుక్కర్లో బోటిని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
చింతచిగురును పేస్టు మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి.
ప్లాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి.
కొద్దిగా పసుపు వేసుకొని, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఉడికించుకున్న బోటిని వేసి కలియబెట్టుకోవాలి.
కాసేపయ్యాక అల్లం పేస్టు వేయాలి. కారం, గరంమసాలా, కరివేపాకు వేసి కలపాలి.
చివరగా చింతచిగురు పేస్టును వేయాలి. చిన్న మంటపై కాసేపు ఉంచి, కొత్తిమీర వేసి దింపుకోవాలి. నోరూరించే చింతచిగురు బోటి రెడీ.
Related Web Stories
స్నేహంలో ఫాలో కావాల్సిన రూల్స్!
అసలు మంచే కురవని దేశాలు గురించి తెలుసా..
మన శరీరం గురించి మీకు ఈ విషయాలు తెలుసా...
ఈ మొక్క పడకగదిలో ఉంటే ఇన్నీ ఉపయోగాలా..