తాగే ముందు ప్యాకెట్ పాలను మరిగిస్తే ఏం జరుగుతుంది..

మన దేశంలో అందరూ దాదాపు పాలను మరిగించిన తర్వాతే ఉపయోగిస్తారు. అది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం

స్థానికంగా పాలను కొన్నప్పుడు కచ్చితంగా వేడి చేయాల్సిందే. లేకపోతే బ్యాక్టీరియా నాశనం కాదు. పాలను వేడి చేయడానికి ముఖ్య కారణం అదే. 

ప్యాకెట్ పాలను కూడా దాదాపు అందరూ వేడి చేసిన తర్వాతే ఉపయోగిస్తారు. నిజానికి ప్యాకెట్ పాలను వేడి చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.

పాలను పాశ్చరైజేషన్ చేసిన తర్వాతే ప్యాకింగ్ చేస్తారు. అంటే పాలలోని ప్రమాదకర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. 

ప్యాకెట్ పాలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వేడి చేయడం వల్ల అందులోని విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు కూడా పోతాయి. 

ప్యాకెట్ బాగా ఉండి, సరిగ్గా స్టోర్ చేసి ఉంటే ప్యాకెట్ పాలను మరిగించకుండా ఉపయోగించుకోవడమే మంచిది. 

ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా డైరీ నుంచి  తీసుకొచ్చిన పాలను మాత్రం కచ్చితంగా వేడి చేయాల్సిందే. లేకపోతే హానికర బ్యాక్టీరియా శరీరంలోకి చేరిపోతుంది. 

ప్యాకెట్ పాలను పొంగే వరకు కాకుండా గోరు వెచ్చగా వేడి చేస్తే సరిపోతుంది. బ్యాక్టీరియా నాశనం అయి అవసరమైన పోషకాలు మిగులుతాయి.