ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల లెక్కలేనన్ని ఉపయోగాలున్నాయి. ఆయుర్వేద, అల్లోపతి విధానాలు రెండూ వాకింగ్‌కు పెద్దపీట వేస్తున్నాయి.
6-6-6 వాకింగ్ రూల్ ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రూల్ ప్రకారం నడిస్తే త్వరగా బరువు తగ్గవచ్చట.
ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రోజులో 60 నిమిషాల పాటు నడవాలట. 6 నిమిషాలు వార్మప్‌నకు, 6 నిమిషాలు కూల్ డౌన్‌కు కేటాయించాలట.
ఉదయాన్నే 6 గంటలకు నడక ప్రారంభించి 30 నిమిషాల పాటు నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా, లంగ్ కెపాసిటీ పెరుగుతుందట.
ఉదయం నడక వల్ల మెటబాలిజమ్ పెరగడం, రక్త ప్రసరణ పెరగడమే కాకుండా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయట.
సాయంత్రం 6 గంటలకు నడక ప్రారంభించి మరో 30 నిమిషాలు నడవాలి. సాయంత్రం నడక స్ట్రెస్‌ను తగ్గిస్తుందట. అలాగే మనసును ప్రశాంతంగా మార్చి మంచి నిద్రకు దోహదం చేస్తుంది.
రోజులో 60 నిమిషాల వాకింగ్ కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. 12 గంటల విరామంలో 30 నిమిషాల చొప్పున వాకింగ్ చేస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం గణనీయంగా తగ్గుతుందట.
వాకింగ్‌కు ముందు 6 నిమిషాలు వార్మప్ వ్యాయామాలు చేయాలి. అలాగే వాకింగ్ తర్వాత 6 నిమిషాల పాటు స్ట్రెచింగ్ వర్కవుట్స్ చేయాలి.