a57570fb-9947-4f6e-9878-d6b73e516026-suc.jpg

జీవితంలో సక్సెస్ కావాలంటే చెయ్యాల్సిన 10 పనులివీ..!

5add31b7-ebaf-4f0c-b719-8200c337d77d-sucs2.jpg

ఉదయాన్నే లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజు ప్రణాళిక రూపొందించుకోవడానికి ఇది సహాయపడుతుంది.

a51b6b40-4475-4ad4-9c39-1b4289a9fd16-sucs1.jpg

నెగిటివ్ గా మాట్లాడే వారికి, వ్యతిరేకత చూపించే మనుషులకు దూరంగా ఉండాలి. ఇది పాజిటివ్ ఆలోచనలు ఉండేలా చేస్తుంది.

0c51f2cf-bf5c-4a2a-aa3d-3d49aec1f2f7-sucs4.jpg

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇది శరీరాన్ని, మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

be8eca92-3455-45e9-9605-c7b6bc063d4b-sucs3.jpg

వారంలో 6రోజులు వ్యాయామం చేయాలి. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. హార్మోన్ల  పనితీరు సక్రమంగా ఉంచుతుంది.

0682ad24-100e-49d2-9361-5303fcaac91a-sucs5.jpg

 రోజూ 20నిమిషాల పాటు మంచి పుస్తకాన్ని చదవాలి. ఇది  భాషను మెరుగుపరచుకోవడానికి, కొత్త విషయాలు, ప్రపంచ జ్ఞానం గ్రహించడానికి తోడ్పడుతుంది.

16ea5922-67d5-4171-a5cd-2341a9259c5e-sucs6.jpg

రోజులో 30నిమిషాల పాటు అన్ని పనులు పక్కన పెట్టి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇది కొత్త నైపుణ్యాల అభివృద్దికి దోహదం చేస్తుంది.

01de32b5-b025-4d64-894b-8f90b32a6c0c-sucs7.jpg

ప్రతిరోజూ 15నిమిషాల సేపు మౌనంగా ఉండాలి. ఇది ఆత్మపరిశీలన చేసుకోవడానికి దోహదం చేస్తుంది. ధ్యానం చేయడానికి సహాయపడుతుంది.

50e3018d-ccc9-45a8-8f05-e6dd766de510-sucs8.jpg

రోజూ రాత్రి  ఆ రోజు జరిగిన విషయాలను నెమరువేసుకోవడం,  డైరీలో రాసుకోవడం  చేయాలి.  రోజురోజుకూ మెరుగుపడుతున్నామా లేదా అర్థమవుతుంది.

1e32598b-87e4-4521-931e-ac5b710e2243-sucs9.jpg

 నిద్రపోయే ముందు 5నిమిషాల సేపు కళ్లు మూసుకుని  లక్ష్యాల గురించి పాజిటివ్ గా ఆలోచించాలి.  వాటిని సాధించినట్టు అనుభూతి చెందాలి. మనిషిలో సబ్ కాన్షియస్ శక్తి విజయానికి దగ్గర చేస్తుంది.

708270d2-fab7-469b-a500-e71c5599afed-sucs10.jpg

జీవితంలో ఏది లభించినా, చెయ్యి జారిపోయినా అంతా మంచికే అనుకోవాలి. ఉన్న జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.