గమనించడం..గమనించడం ఓ గొప్ప లక్షణం. ముఖ్యమైన విషయాలే కాదు.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, చిన్న విషయాలను కూడా గమనిస్తే పరిణితి పెరుగుతుంది.
చదవడం, రాయడం..
చదవడం మంచి అలవాటు. మెదడును, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది ఇది. బాగా చదవడం, మనసులో ఉన్న భావాలకు అక్షర రూపం ఇవ్వడం వల్ల ఆలోచనలు మెరుగవుతాయి.
వినడం..
ఎవరు ఏం చెప్పినా వినడమే కాదు.. చుట్టూ ఉన్న పరిసరాల మీద కూడా దృష్టి ఉంచాలి. పాటలు, పాడ్ క్యాస్ట్ లు, ఇంటర్వ్యూలు వంటివి వింటూ ఉంటే వినడం అనే నైపుణ్యం పెరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ప్రయోగాలు..
రొటీన్ గా ఉండకూడదు. కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి. కొత్త అభిరుచులు, నైపుణ్యాలు పెంచుకోవడం, కష్టమైన లక్ష్యాలను సాధించడం చేయాలి.
ప్రశ్నించడం..
ఏ చిన్న సందేహం ఉన్నా దాని గురించి ప్రశ్నించాలి. ఇది అన్ని విషయాలకు సమాధానం తెలుసుకునేలా చేస్తుంది.
మాట్లాడాలి..
ఆలోచనలను, అభిప్రాయాలను గురించి రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండాలి. చర్చించడం వల్ల ఒక విషయం గురించి భిన్న కోణాలు అర్థం చేసుకోవచ్చు.
వ్యాయామం..
వ్యాయామం శరీరానికి మాత్రమే కాదు.. మనస్సుకు కూడా మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.
విశ్లేషణ..
ప్రతి రోజూ ఆ రోజు జరిగిన విషయాలను విశ్లేషించుకోవాలి. దీని వల్ల మరుసటి రోజును మరింత మెరుగ్గా ఉంచుకోవడానికి అనువుగా ఉంటుంది.
యోగా..
శరీరం. మెదడు, మనసు ఈ మూడూ కలసి పనిచేసినప్పుడు ప్రతి పని సంపూర్ణం అవుతుంది. దీని కోసం యోగా చేయాలి.