ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే వారసత్వం అన్నింట్లోకి ముఖ్య కారణం. అలాగే ఊబకాయం, స్మోకింగ్, ఒత్తిడి, హార్మోన్ల లోపం ఇతర కారణాలు.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా మీ జుట్టును నల్లగా మార్చుకోవడానికి కొన్ని టిప్స్ పాటించి చూడండి..
వారానికి రెండు సార్లు నల్ల నువ్వులను తినండి. ఇవి మీ శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేసి మీ జట్టును నల్లగా మారుస్తాయి.
ఉసిరి కాయ జుట్టు రంగను నల్లగా మార్చగలదు. ఉసిరి నూనెతో మీ తలను మసాజ్ చేసుకోండి. అలాగే ఉసిరి రసం తాగండి. కొబ్బరి నూనెలో ఎండిన ఉసిరి పండును వేసి మరగబెట్టి జుట్టుకు రాయండి
కరివేపాకును దంచి, పెరుగుతో కలపి పేస్ట్‌లా చేసుకోండి. ఆ పేస్ట్‌ను వారానికి రెండు సార్లు తలకు పట్టించండి.
అశ్వగంధ వేరు పొడి, బ్రహ్మీ పొడిని కలిపి మిశ్రమంలా చేసుకుని జుట్టుకు రాసుకోండి. ఇది జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ పెరిగేలా చేస్తుంది.
బృంగరాజ్ ఆకులను రాత్రంతా నూనెలో నానబెట్టి ఉదయాన్నే తలకు రాసుకోండి. మీ జట్టు పెరగడమే కాకుండా నిగనిగలాడుతుంది.
మందారలో విటమిన్ ఏ, సీ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మందారు పువ్వులను పొడిలా చేసి కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.
టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌ను వేడి నీటిలో కలిపి చల్లార్చాలి. తర్వాత దానికి హెన్నా పౌడర్‌ను కలిపి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఏదో ఒక నూనెలో కలిపి తలకు పట్టించాలి.