దీపావళి లక్ష్మీ పూజను ఈ సింపుల్ టిప్స్ తో జరుపుకోండి..
దీపావళి రోజు లక్ష్మీ పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ కొందరు పూజ చేసుకోవడం అంటే చాలా కష్టం అనుకుంటారు.
కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే దీపావళి పూజను సులభంగా, అంతే శాస్త్రోక్తంగా పూర్తీ చేయవచ్చు.
ఇంటిని, పూజ జరిగే ప్రాంతాన్ని పూర్తీగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా ఉన్నచోటికే లక్ష్మీదేవి వస్తుంది.
లక్ష్మీదేవి విగ్రహం లేదా పటాన్ని ఒక పీట మీద ఉంచి పూలతో అలంకరించాలి. ఇరువైపులా దీపాలు వెలిగించాలి.
బియ్యం, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, కర్పూరం, అగరువత్తులు, నూనె, వత్తులు వంటివన్నీ ముందుగానే సేకరించుకోవాలి.
ఇంటి ద్వారం దగ్గర, లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు ముగ్గులు వేసి పువ్వులతో, రంగులతో అలంకరించాలి.
లక్ష్మీ దేవి విగ్రహం చుట్టూ తాజా పువ్వులు, తామర, బంతి పువ్వులను ఉంచాలి. ఇవి పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తాయి.
ఇంటి చుట్టూ దీపాలు వెలిగించాలి.
లక్ష్మీ దేవికి నైవేద్యంగా ఉంచడానికి తీపి పదార్థాలు ముందుగానే సిద్దం చేసుకుని ఉండాలి.
పూజ సమయంలో లక్ష్మీ దేవి మంత్రాలు, శ్లోకాలు పఠించడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం నెలకుంటుంది.
కొబ్బరి కాయ కొట్టడం, కర్పూర హారతి ఇవ్వడం, ప్రసాదం ఇంటిల్లిపాది తీసుకోవడం ద్వారా లక్ష్లీదేవి పూజ ముగించవచ్చు.
Related Web Stories
ఇంట్రోవర్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా..
ఆహారం, నీళ్లు లేకుండా ఎక్కువకాలం జీవించే జంతువులు ఇవే!
కన్నులపండుగగా అయోధ్య దీపోత్సవ్