ఈ చిన్న టిప్స్ పాటించండి..
మీ లైఫ్‌కు పదేళ్లు యాడ్ చేసుకోండి..
ప్రతిరోజు ఉదయాన్నే కనీసం అరగంట నడిచే అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.
ఉదయం సమయంలో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తే రోజు వారి ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రతిరోజు ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు చేస్తే నరాల పైన ఒత్తిడి తగ్గుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
రోజులో కొద్ది సేపు అయినా స్నేహితులతో గడిపి మనసారా నవ్వుకుంటే మానసిక సమస్యలు దూరమవుతాయి.
బయట దొరికే ఆహారాలు, జంక్ ఫుడ్ తినడాన్ని వీలైనంత మేరకు తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గిస్తే జీవితకాలం పెరుగుతుంది.
రోజులో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం. మెదడు, శరీరం నిద్రలోనే జీవశక్తిని పొందుతాయి.
విటమిన్లు, ప్రోటీన్లతో నిండిన సమతుల ఆహారం తీసుకోవడంపై దృష్టి సారించండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోండి.
వారానికి ఒకసారైన ప్రకృతిలో సమయం గడపండి. మొక్కలు, చెట్ల మధ్య గడిపితే ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
రోజులో కొద్ది సేపు అయినా ఎండలో నిల్చోండి. శరీరానికి అత్యంత అవసరమైన డి-విటమిన్ పొందండి.
Related Web Stories
చలికాలంలో చర్మసంరక్షణ కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలి..
రవ్వ బొబ్బట్లను ఇలా చేస్తే.. ఒక్కటి కూడా మిగల్చరు!
ఈ చేపలకు ఈతే కాదు.. ఎగరడమూ వచ్చు..!!
ఇవంటే కోతులకు భయమని మీకు తెలుసా..