ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో గ్యాడ్జెట్లు సేఫ్..!
ఫోన్ లేకుండా బయటకు వెళ్లలేని కాలమిది. వర్షంలో తడిస్తే గ్యాడ్జెట్లు పాడైపోతాయి. వాటిని సింపుల్ ట్రిక్స్ తో సేఫ్ గా ఉంచుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్ వంటివి తడవకుండా వాటర్ రెసిస్టెంట్ స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగించాలి.
వర్షాకాలంలో ఇంటినుండి బయటకు వెళితే వాటర్ ప్రూఫ్ బ్యాగ్ వెంట తీసుకెళ్లాలి.
కిటికీ, బాల్కనీ వంటి ప్రదేశాలలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఉంచకూడదు.
స్టైలిష్ గా ఉన్న ఫోన్ కవర్లు ఫోన్ ను నీటి నుండి రక్షించలేవు. వీటికి బదులు సిలికాన్ కవర్లు వాడాలి.
ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్ లోకి నీరు చేరితే వాటిని సిలికా జెల్, బియ్యం వేసిన కవర్లలో ఉంచాలి.
వర్షంలో బయటకు వెళ్లాల్సి వస్తే వీలైనంత వరకు గ్యాడ్జెట్లు బయటకు తీసుకెళ్లకపోవడం మంచిది.
ఫోన్, ల్యాప్ టాప్ లో ముఖ్యమైన ఫైల్స్, ఫొటోస్, ఇతర సమాచారం ఉంటే ముందుగానే బ్యాకప్ పెట్టుకోవాలి.
గ్యాడ్జెట్ల మీద నీరు పడితే పొడి మైక్రో ఫైబర్ క్లాత్ లతో శుభ్రం చేయాలి.
Related Web Stories
చాణక్యుడు చెప్పిన ఈ 10 విషయాలు అనుసరిస్తే.. యువత విజయాల బాట పడతారు!
బీపీ కంట్రోల్లోకి రావాలంటే.. వీటిని తాగండి..!
అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా? వీటిని గుర్తించండి..!
మంచి కొవ్వు పెరగాలంటే ఇలా చేయండి సరిపోతుంది..!