ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఎంత డబ్బు ఆదా చేయవచ్చో తెలుసా?
కాలంతో పాటూ బాధ్యతలు పెరుగుతాయి. చాలామటుకు జీవితం డబ్బు మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ తో డబ్బును ఆదా చేసుకోవచ్చు.
రోజంతా ఖర్చు చేసే డబ్బును ట్రాక్ చేయాలి. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాం అనేది లెక్క వేసుకుంటే ఎక్కడ అదనంగా ఖర్చు చేశామో తెలిసిపోతుంది.
నెలలో సంపాదన ఎంత? ఖర్చు ఎంత? వేటికి ఎంత ఖర్చు చేయాలి? అని బడ్జెట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రణాళికా బద్దంగా ఖర్చు పెట్టాలి. ఇది డబ్బు పొదుపు చేయడానికి సహాయపడుతుంది.
చాలామంది వాడుకోకపోయినా కొన్ని యాప్ లు, ఓటిటి సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. అలాంటివి మానేస్తే చాలా డబ్బు ఆదా అవుతుంది.
స్మార్ట్ గా షాపింగ్ చేయడం నేర్చుకోవాలి. అవసరమైన వస్తువులను, క్వాలిటీ చూసి కొనుగోలు చేస్తే ఎక్కువకాలం మన్నిక వస్తాయి.
బయటి ఆహారం తినకపోవడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం దెబ్బతినదు. రెండోది ఇంట్లోనే ఇంటిల్లిపాది సంతోషంగా తినవచ్చు.
జిమ్ తో పాటూ చాలా రకాల విషయాలకు డబ్బు కట్టి మెంబర్షిప్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లోనే చక్కగా వ్యాయామం, యోగా వంటివి చేయవచ్చు.
ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మరమ్మత్తులు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది పెద్ద నష్టాలను నివారిస్తుంది.
LED బల్బులను ఉపయోగిస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. తక్కువ బరువున్న ఎలక్ట్రానిక్ వస్తువులను వాడాలి. మొక్కలను పెంచుకుంటే ఇంటి వాతావరణం చల్లగా ఉంటుంది. ఏసీ, కూలర్ వాడకం తగ్గుతుంది.