వేసవిలో ఈ టిప్స్ పాటించండి.. కరెంట్ బిల్లు ఆదా చేసుకోండి..

పగటిపూట మీ ఇంటిని సహజకాంతితో నింపండి. వేసవిలో ఎండ కారణంగా కాంతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి పగటిపూట లైట్లను వాడడం తగ్గించండి.

మీ ఏసీ ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య మాత్రమే ఉంచండి. ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. అలా చేస్తే రూమ్ త్వరగా కూల్ అవుతుంది.

వీలైతే మీ బట్టలను చల్లటి నీటితో ఉతకండి. బట్టలను ఆరబెట్టేందుకు డ్రయర్‌‌లను ఉపయోగించకండి. ఎండలో ఆరబెట్టండి.

మీ ఫ్రిడ్జ్ తలుపును అనవసరంగా తెరవకండి. తలుపు తెరవడం వల్ల కరెంట్ వినియోగం పెరుగుతుంది. ఫ్రిడ్జ్‌ను తరచుగా డీఫ్రాస్ట్ చేస్తూ ఉండండి.

మీ ఇంట్లో సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించండి. ఇవి ప్రకాశవంతమైన కాంతిని ఇవ్వడమే కాకుండా, కరెంట్ బిల్లును కూడా తగ్గిస్తాయి.

చల్లదనం కోసం కూలర్‌లను వాడకండి. ఏసీల కంటే కూలర్‌ల వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని గుర్తుంచుకోండి.

ఉపయోగించలేనపుడు ఛార్జర్‌లు, టీవీ, కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్లగ్‌లను తీసేయండి. ఇలా కూడా కరెంట్ ఆదా చేయవచ్చు.

మీ ఇంట్లో స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్లను ఉపయోగించండి. ఇవి కరెంట్‌ను చాలా తక్కువగా వినియోగించుకుంటాయి.