ఆఫీసులో నిద్ర వస్తుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!
ఆఫీసులో పని చేసేటప్పుడు చాలామందికి నిద్ర వస్తుంది. కానీ పడుకోవడం కుదరదు.
పని చేసే సమయాల్లో నిద్రను వదిలించుకోవాలంటే కొన్ని ఈజీ ట్రిక్స్ ఉన్నాయి.
నిద్ర వచ్చినట్టు అనిపిస్తే మెడను వృత్తాకారంగా రెండు దిశలలోనూ తిప్పుతూ మెడ వ్యాయామం చేయాలి. రిలాక్స్ గా అనిపించి నిద్ర దూరం అవుతుంది.
వర్క్ చేస్తున్నప్పుడు చేతులను సాగదీసి మణికట్టును వెనుకగా వంచి చేతి వేళ్లను బంధించాలి. చేతులను సాగదీయడం వల్ల నిద్ర మాయమవుతుంది.
కుర్చీలో కూర్చొన్నప్పుడు ఒక కాలిని కొద్దిగా వంచి మరొక కాలిని నిటారుగా ఉంచి చైర్ నుండి శరీరాన్ని ముందుకు వంచాలి. ఇది అలసటను తగ్గిస్తుంది.
చేతులను పైకి లేపి చేతి వేళ్లను బంధించి భుజాలను సాగదీయాలి. ఇది నిద్ర మత్తును వదిలిస్తుంది.
కూర్చుని ఉండగానే కుడి చేతిని ఎడమ వైపు, ఎడమ చేతిని కుడి వైపు చాచుతూ శరీరాన్ని రిలాక్స్ చేసుకోవాలి.
కుర్చీ మీద కూర్చుని చేతులను కుర్చీ వెనుకగా ఉంచి గట్టిగా పట్టుకోవాలి. వీపును సున్నితంగా వెనక్కు వంచాలి. ఇది చాతీని రిలాక్స్ చేస్తుంది.
శ్వాస వ్యాయామాలు ఎలాంటి సమయాల్లో అయినా సహాయపడతాయి. నిద్ర వస్తే లోతైన శ్వాస తీసుకుని మెల్లిగా శ్వాస వదలాలి. మెదడును శరీరాన్ని చురుగ్గా మారుస్తుంది.
Related Web Stories
తాగే ముందు ప్యాకెట్ పాలను మరిగిస్తే ఏం జరుగుతుంది..
పాల కల్తీని ఇలా ఇంట్లోనే గుర్తించండి..
దసరాకు ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి.. పూజా విధానం..
రాక్షస సుడిగాలుల గురించి మీకు తెలీని ఇంట్రెస్టింగ్ విషయాలు!