ఆయిల్ ఫుడ్ తిన్నారా? వెంటనే ఇలా చేయండి..!

ఆయిల్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ ఇబ్బందిపడుతుంది. అందుకే ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే కొన్ని టిప్స్ పాటిస్తే సైడ్-ఎఫెక్ట్స్‌ను కొంత వరకు తగ్గించుకోవచ్చు. 

పెరుగు, మజ్జిగ వంటి ప్రో బయోటిక్స్ ఫుడ్‌లో లాక్టిక్‌ యాసిడ్‌ బాసిల్లై అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆయిల్ ఫుడ్ సైడ్-ఎఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది. 

ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత వేడి నీటిని తాగండి. 

ఆయిల్ ఫుడ్ భారీగా తిన్న తర్వాత కచ్చితంగా వాము నీళ్లు తాగండి.

ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లటి పదార్థాలను తినకండి. 

ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత గ్రీన్ టీ లేదా అల్లం టీ తాగండి. 

ఆయిల్ ఫుడ్ తర్వాత తినే భోజనంలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే ఫుడ్ తీసుకోండి. 

వేపుడు పదార్థాలు తిన్న తర్వాత గింజలు, విత్తనాలు తింటే మంచిది. 

ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత వాకింగ్, శారీరక శ్రమ చేయండి.