వంటగదిలో ఈ
చిట్కాలు పాటిస్తే..!
పుదీనా పచ్చడి చేసేటప్పుడు
పెరుగు కలిపితే రుచిగా ఉంటుంది.
బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను
ఉడకబెడితే పెంకులు సులువుగా వస్తాయి.
కూరల్లో పులుపు తక్కువగా ఉంటే
మామిడి పొడితో కొంచెం పెరుగుకలిపి
కూరలో వేస్తే టమోటా రుచి వస్తుంది.
బ్రెడ్ ప్యాకెట్‌లో బంగాళదుంపలు
ముక్కలు ఉంచితే బ్రెడ్ త్వరగా పాడవదు.
వంటింట్లో బొద్దింకల బెడద తగ్గిపోవాలంటే
బోరిక్ పౌడర్‌ను మూలల్లో చల్లాలి.
కూరల్లో ఉప్పు ఎక్కువైతే కొబ్బరి
ముక్క లేదా టమోటా ముక్కలు వేస్తే సరి.
ఫ్రిజ్‌లో పుదీనా ఆకులు ఉంచితే
ఫ్రిజ్‌లో దుర్వాసన పోతుంది.
జ్యూస్ జార్స్‌లో వాసన వస్తోంటే
ఉప్పులో కొద్దిగా నీళ్లుపోసి ఆ మిశ్రమాన్ని
రుద్దాలి. తర్వాత నీళ్లతో శుభ్రం చేయాలి.
Related Web Stories
ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్.. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం చిత్ర ప్రముఖుల విరాళం
సోయా క్యాండిల్ ఎంత స్పెషల్ అంటే.. !
నేతి కాఫీ తాగండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..