వర్షాకాలంలో  దోమలను తరిమికొట్టేందుకు  సులభ చిట్కాలివే...

నారింజ, నిమ్మకాయలను సగానికి కట్ చేసి తలుపులు, కిటికీల వద్ద ఉంచాలి. ఈ వాసనకు దోమలు దూరంగా ఉంటాయి. 

లావెండర్ ఆయిల్ దోమల  వికర్షకంగా పని చేస్తుంది. 

కొబ్బరి నూనె లేదా బాదం నూనెలో 10 చుక్కల లావెండర్ ఆయిల్ కలిపాలి. 

ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకోవడం  వల్ల దోమలు దూరంగా ఉంటాయి. 

మిగిలిపోయిన కాఫీ పొడిని గిన్నెల్లో  వేసి ఇంటి పరిసరాల్లో ఉంచాలి.

పిప్పరమెంట్ నూనె కూడా  దోమల వికర్షకంగా పని చేస్తుంది.

వెల్లుల్లి ఉడకబెట్టిన నీటిని స్ప్రేయడం వల్ల కూడా దోమలు రాకుండా ఉంటాయి.

ఇంటి చుట్టూ తులసి, యూకలిప్టస్,  లెమన్‌ గ్రాస్ మొక్కలను పెంచుకుంటే దోమలు రావు.