ఫ్రిడ్జ్ నీటి కంటే కుండ నీరు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే కుండి నీరు ఎప్పటికీ చల్లగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
కుండ నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే కుండ నీరు కొన్నిసార్లు రుచి మారడంతో పాటూ దుర్వాసన వస్తుంది.
కుండ నీరు ఎప్పటికీ చల్లగా ఉండడంతో పాటూ తాజాగా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
కుండ సగం మునిగే వరకూ మట్టిలో పాతిపెట్టాలి. చుట్టూ మట్టితో నింపి, సగం నీరు పోసి మూత పెట్టాలి.
ఇలా చేస్తే 15 నిముషాల వ్యవధిలో నీరు చల్లబడుతుంది. ఈ నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కుండలను మట్టితోనే కాకుండా ఇసుకలోనూ పాతిపెట్టొచ్చు. అలాగే కుండపై గోనె సంచులు కప్పితే నీరు చల్లగా ఉంటుంది.
రెండు, మూడు వారాల తర్వాత కుండలోని నీటిని పూర్తిగా తీసేసి శుభ్రం చేయాలి.
కడిగిన కుండలను ఎండలో ఆరబెట్టిన తర్వాత మళ్లీ యథావిధిగా ఉపయోగిస్తే నీరు స్వచ్ఛంగా ఉంటుంది.
Related Web Stories
ప్రపంచ నీటి దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
మెరిసే చర్మం కోసం ఇంట్లో తయారుచేసుకునే టోనర్లు ఇవే..!
ప్రపంచ అటవీ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
ఈ జీవులకు నిప్పు అంటే ఇష్టమని.. మీకు తెలుసా..?