మీ ముఖం జిడ్డుగా ఉందా.. ఈ చిట్కాలు పాటిస్తే మెరిసిపోతారు

ముందుగా జిడ్డు ముఖం ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగత్త్రలు తీసుకోవాలి.

ముఖ్యంగా ఆయిల్‌ఫుడ్ , జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. ఎర్ర మాంసం, పాలతో చేసిన ఉత్పత్తులు, చక్కెర పానీయాలను కూడా తక్కువగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

జిడ్డు సమస్యలను తగ్గించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ముఖాన్ని శుభ్రపరుచుకోండి. 

అరటిపండు, దోసకాయ, పప్పులు, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే జిడ్డు సమస్య తగ్గే అవకాశం ఉంది.

ఇంటి చిట్కా: జిడ్డు ముఖం ఉన్న వారు ముఖ్యంగా దుమ్ము, సూర్య కాంతి నుంచి ముఖాన్ని రక్షించుకోవాలి. రోజుకు నాలుగు, ఐదు సార్లు మంచి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి.

ముఖం జిడ్డుగా ఉందని ఎక్కువగా ఫేస్ వాష్ క్రీం లను వాడటం ఏ మాత్రం మంచిది కాదు.

కొన్ని ఇంటిలోనే తయారుచేసుకునే ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తే ముఖంపై ఉండే జిడ్డు తగ్గిపోయి ఫేస్ అందంగా, ఆకర్షణీయంగా, మృదువుగా కనిపిస్తుంది.

రోజ్ వాటర్: జిడ్డు సమస్యను తగ్గించడానికి రోజ్ వాటర్ మంచిగా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్‌లో యాంటీ మైక్రోబయాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. 

రోజ్ వాటర్‌లో కాటన్ బాల్స్‌ను ముంచి వీటితో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే ఫేస్‌పై ఉన్న జిడ్డు తగ్గిపోతుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల చర్మం అందంగా, మృదువుగా కనిపిస్తుంది.

కమలా కాయ పౌడర్: కమలా కాయ తొక్క పౌడర్ కూడా ముఖంపై ఉన్న జిడ్డును తగ్గించడానికి సహాయం చేస్తుంది. 

 అంతేకాకుండా కావలసిన పోషకాలను అందించి చర్మాన్ని మరింత మృదువుగా తయారుచేస్తుంది. 

ఫేస్ ప్యాక్ తయారీ కోసం ఒక గిన్నలో కమలా కాయ తొక్క పౌడర్, 4 టేబుల్ స్పూన్ పాలు, ఒక చెంచా కొబ్బరి నూనె, 2 టీస్పూన్ రోజ్ వాటర్ వేసి ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకుని ముఖానికి పట్టించుకోండి. 

20 నిమిషాల తర్వాత ఫేస్‌ను శుభ్రపరుచుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల ఫేస్ పై ఉన్న జిడ్డు తగ్గి మంచి ఫలితం ఉంటుంది. 

 జిడ్డు సమస్యలు తగ్గి చర్మం అందంగా తయారు కావడమే కాకుండా మృదువుగా తయారుచేస్తుంది.