పండుగలు వచ్చాయంటే ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అదే సమయంలో ఖర్చుతో కూడుకుని ఉంటాయి.
పండుగల వేళ అనవసర ఖర్చును తగ్గించడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
పండుగల సమయంలో మీ బడ్జెట్‌ను ముందుగా అంచనా వేసుకోండి. ఎంత ఖర్చు చేయగలరో నిర్ణయించుకుని.. ఆ పరిధిలో మాత్రమే ఖర్చు పెట్టండి.
పండుగ వేళ అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి. దీనికోసం ముందుగా ఓ జాబితా సిద్ధం చేసుకోండి.
అవసరమైన వస్తువుల జాబితాను సిద్ధం చేసుకుని ముందుగానే వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా చివరి నిమిషంలో షాపింగ్‌ను నివారించవచ్చు. వస్తువులు కొనేటప్పుడు డిస్కౌంట్ల గురించి తెలుసుకోవాలి.
నగదు చెల్లింపులు చేస్తే మీరు బడ్జెట్ పరిధిలో ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు చేయడంతో పాటు భవిష్యత్తులో అప్పులకు దారి తీయవచ్చు.
మీరు దేనికోసం ఖర్చు చేస్తున్నారో రాసుకోండి. ఇది మీ బడ్జెట్‌ను దాటిపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
ఆఫర్లు ఉన్నాయని అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయవద్దు. మీ జాబితాలో ఉన్న వస్తువులను కొనేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.
ఎవరికైనా ఇచ్చేందుకు బహుమతులు ఇంట్లో ఉన్న వస్తువులతో తయారుచేయడంపై దృష్టి పెట్టండి. దీని ద్వారా కొన్ని డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
మీ ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం ద్వారా పండుగ సీజన్‌లో అనవసర ఖర్చులను తగ్గించవచ్చు.