తెల్ల జట్టును మూలాల నుండి నల్లగా మార్చే సూపర్ టిప్స్..!
తెల్ల జుట్టుతో ఇబ్బంది పడేవారు చాలా రకాల హెయిర్ డైలు ఉపయోగిస్తుంటారు. వీటిలో రసాయనాలు దుష్పభావాలు కలిగిస్తాయి.
వంటింట్లో తప్పనిసరిగా ఉండే పసుపును హెయిర్ డై గా ఉపయోగిస్తే జుట్టు మూలాల నుండి నల్లబడుతుంది.
ఆవాల నూనెలో పసుపు కలిపి ఉడికించాలి. ఈ మిశ్రమంలో ఒక చెంచా కాఫీ, 2 విటమిన్-ఇ క్యాప్సూల్స్ జోడించాలి. అంతే ఇంట్లోనే హెయిర్ డై రెఢీ.
ఈ హెయిర్ డై ను జుట్టుకు పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి. గంట తరువాత తలస్నానం చెయ్యాలి.
తెల్లజట్టును సహజంగా నల్లగా మార్చడానికి హెన్నా పౌడర్ లో ఇండిగో పౌడర్ కలిపి కూడా రాసుకోవచ్చు.
హెన్నా, ఇండిగో పౌడర్ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30నిమిషాలు అలాగే ఉంచి తరువాత తలస్నానం చెయ్యాలి.
కొబ్బరినూనెలో మెంతి గింజలు, కరివేపాకు వేసి ఉడికించాలి. ఈ నూనెను క్రమం తప్పకుండా రాస్తుంటే తెల్ల జుట్టు మూలాల నుండి నల్లగా మారుతుంది.
కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి తలకు రాస్తుంటే జుట్టు నెరవడం అనే సమస్య ఎదురుకాదు.
Related Web Stories
విచారాన్ని ఎదుర్కోవాలంటే 8 చిట్కాలు ఇవే..
జుట్టు పోషణలో ఈ ఇబ్బందులు లేకుంటే సరి..!
ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల ప్రయోజనాలేంటి..!
మీ RO ఎంత విద్యుత్ వినియోగిస్తుందో మీకు తెలుసా?