ఇడ్లీలు మృదువుగా ఉండాలంటే  ఈ ట్రిక్స్ ఫాలో కండి .!

ముందుగా మిన‌ప ప‌ప్పును  శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు  పోసి, 4 నుండి 5 గంట‌ల  పాటు నాన‌బెట్టుకోవాలి. 

ఇడ్లీ రవ్వను కూడా పిండి  పట్టడానికి ఒక‌ గంట పాటు  నాన‌బెట్టుకోవాలి.

ఇలా నాన‌బెట్టుకున్న మిన‌ప  ప‌ప్పును జార్‌‌లో‌వేసి త‌గిన‌న్ని  చల్లని నీళ్లు పోసి మెత్తగా  మిక్సీ ప‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి.

మిన‌ప ప‌ప్పును మిక్సీ ప‌ట్టేట‌ప్పుడు  చ‌ల్లని నీటిని పోయ‌డం వ‌ల్ల  ఇడ్లీలు మెత్తగా వ‌స్తాయి. 

ఇప్పుడు ఇడ్లీ ర‌వ్వలో ఉన్న  నీళ్లన్నీ పోయేలా చేత్తో  పిండుతూమిక్సీ ప‌ట్టుకున్న  పిండిలో వేసి బాగా క‌లపాలి. 

 మూత పెట్టి 6 నుండి 8  గంట‌ల పాటు మాత్రమే  పులియ‌బెట్టాలి.

8 గంట‌ల కంటే ఎక్కువ  స‌మ‌యం పాటు పిండిని  పులియ‌బెట్టకూడ‌దు.

పిండి పులిసిన త‌రువాత  మూత తీసి త‌గినంత ఉప్పు,  నీళ్లు పోసి మ‌రీ ప‌లుచ‌గా,  మ‌రీ గ‌ట్టిగా కాకుండా  క‌లుపుకోవాలి. 

 ఇప్పుడు పిండిని ఇడ్లీ  పాత్రలో వేసి మూత పెట్టి  సన్నని మంట‌పై కేవ‌లం  10 నిమిషాల పాటు మాత్రమే  ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఇడ్లీలు  మెత్తగా, మృదువుగా ఉంటాయి.

ఈ ఇడ్లీల‌ను పల్లి చ‌ట్నీ,  సాంబార్‌తో క‌లిపి తింటే  ఎంతో రుచిగా ఉంటాయి.

ఇఇడ్లీల త‌యారీలో కేవ‌లం  స‌న్నగా ఉండే ఇడ్లీ ర‌వ్వను  మాత్రమే ఉప‌యోగించాలి.

ఈ చిట్కాల‌ను పాటించ‌డం  వ‌ల్ల ఇడ్లీలు మెత్తగా వ‌స్తాయి.