వ్యాయామం, డైటింగ్ లేకుండా ఇలా కూడా బరువు తగ్గొచ్చట!

బరువు తగ్గడం అనగానే కఠినమైన డైటింగ్, వ్యాయామం చేయాలని చాలా మంది భయపడుతుంటారు. అయితే కొన్ని ట్రిక్స్ ద్వారా బరువును కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

భోజనం ప్లేట్ ముందు కనీసం 20 నిమిషాలు కూర్చోవాలి. మెల్లిగా నమిలి తినాలి. అప్పుడే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.

భోజనానికి చిన్న చిన్న ప్లేట్‌లను ఉపయోగించాలి. అలా చేయడం వల్ల తక్కువ ఆహారం ప్లేట్ నిండా కనబడుతుంది. ఎక్కువ తింటున్నామనే ఫీలింగ్ వస్తుంది. 

ఉదయాన్నే ప్రోటీన్ ఎక్కుగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే రోజంతా ఆకలి వేయకుండా ఉంటుంది. 

బయటి ఆహారం కాకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వండి. 

ఫైబర్ ఎక్కువగా ఉండే సహజ ఆహార పదార్థాలను వీలైనంత ఎక్కువగా తీసుకోండి. ఇవి బరువును తగ్గించడంలో సహాయపడతాయి. 

భోజనం చేసే ముందు, రోజులో ఇతర సమయంలోనూ వీలైనంత ఎక్కువ నీరు తాగండి. నీరు క్యాలరీ ఇన్‌టేక్‌ను తగ్గిస్తుంది.

టీవీ, మొబైల్ చూస్తూ, స్నేహితులతో మాట్లాడుతూ భోజనం చేయకండి. భోజనం చేసేటపుడు ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే దాని మీద శ్రద్ధ పెట్టండి. 

తక్కువ నిద్ర మీ ఆకలిని విపరీతంగా పెంచేస్తుంది. ఆకలిని పెంచే హార్మోన్లు విడుదలయ్యేలా ప్రోత్సహిస్తుంది. 

విపరీతమైన ఒత్తిడి తినాలనే కోరికను పెంచుతుంది. వీలైనవంత వరకు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.