చలికాలంలో ఇలా చేయకపోతే.. మీ జట్టు ఊడిపోవడం ఖాయం.. 

చలికాలం చర్మంతో పాటు జుట్టుకు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ టిప్స్ పాటించకపోతే మీ జట్టు ఊడిపోవడం ఖాయం. 

చలికాలంలో చర్మంతో పాటు మీ జుత్తు కూడా పొడిబారిపోతుంది. కాబట్టి కొబ్బరి నూనె లేదా అలోవెరాతో మీ తలపై మసాజ్ చేసుకోవాలి. అప్పుడు తగినంత తేమ అందుతుంది 

చలికాలంలో వారానికి ఒక్కసారి మాత్రమే షాంపూతో తలస్నానం చేయండి. ఎక్కువ సార్లు చేస్తే మీ తల మీద సహజ నూనెలు తొలగిపోతాయి. 

బాగా వేడిగా ఉన్న నీటితో తల స్నానం చేయకండి. వేడి నీరు మీ జుట్టును డ్రైగా మార్చేస్తుంది. 

చలికాలంలో స్టైలింగ్ పరికరాలను ఎక్కువగా వినియోగించకండి. అవి జట్టు రాలిపోవడానికి కారణమవుతాయి.

జుట్టు చివర్లను ట్రిమ్మింగ్ చేయించడం మర్చిపోకండి

తల స్నానం చేయకపోయినా హెయిర్ డ్రయర్‌తో జట్టును కాసింత ఆరబెట్టుకోండి.

మంచుతో మీ తలను తడవనివ్వకండి. ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది