పిల్లలలో ఏకాగ్తత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!

తాడాసన.. ఇది పిల్లలు కుదురుగా ఉండటంలో సహాయపడుతుంది.  నిశ్చలంగా నిలబడటం వల్ల  పిల్లల శరీరం ఒక క్రమశిక్షణకు అలవాటు పడుతుంది.

వృక్షాసనం.. వృక్షాసనం శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.  ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

బాలాసన.. దీన్నె పిల్లల భంగిమ అంటారు.  ఒత్తిడి, అలసట నుండి ఉపశమనం పొందేందుకు ఇది సహాయపడుతుంది.

మార్జాలాసనం.. దీన్నే పిల్లి భంగిమ అంటారు. ఇది వెన్నెముకను ఫ్లెక్సిబుల్ గా మారుస్తుంది. పిల్లలు ఎక్కువసేపు కూర్చోవడానికి సహాపడుతుంది.

సింహాసన.. సింహాసన పిల్లలకు చాలా ఫన్ ఇస్తుంది. ముఖం, గొంతు, శ్వాస మొదలైనవన్నీ ఇందులో లీనమై ఉంటాయి. సింహం లాగా ధ్వని చేస్తూ కొన్ని సెకెన్ల పాటూ దీన్ని చేయడం వల్ల ఎంతటి ఒత్తిడి, భావోద్వేగాలు అయినా తగ్గుతాయి.

సేతు బంధాసనం.. ఇది వంతెనను పోలి ఉంటుంది.   ఇది కోర్,  వెనుక కండరాలను బలపరుస్తుంది.

శవాసనం.. ఇది విశ్రాంతికి చక్కని మార్గం. పిల్లలతో వ్యాయామం,  యోగా చేయించిన తరువాత  శవాసనం వేయిస్తే శరీరం రిలాక్స్ అవుతుంది.