శరీరం హాయిగా, తేలిగ్గా మారాలంటే ఆహారపు అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

రోజూ భోజనం చేయడానికి గంట ముందు నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల అతిగా తినకుండా ఉండొచ్చు.

ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయడం మానుకోవాలి. 

రోజూ తినే ఆహారంలో ధాన్యానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. 

కొవ్వు తక్కువగా, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 

ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

ఇలా వారం రోజుల పాటు జాగ్రత్తలు పాటిస్తే శరీరంలో మార్పు కనిపిస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సందేహం వచ్చినా వైద్యులను సంప్రదించాలి.