వ్యోమగాములు అంతరిక్షంలో ఏం తింటారనే సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది.

అయితే, వ్యోమగాములు కొన్ని రకాల ఆహారాలు తినకూడదనే రూల్ ఉంది. స్పేస్ స్టేషన్ భద్రత దృష్ట్యా ఈ నిబంధనల కీలకం

చెక్కర, ఉప్పును పొడి రూపంలో అంతరిక్షంలోకి తీసుకెళ్లకూడదు. కాబట్టి, ద్రవరూపంలో వీటిని తీసుకెళతారు.

బ్రెడ్ కూడా తీసుకెళ్లకూడదు. బ్రెడ్‌లోంచి బయటకొచ్చే సూక్ష్మకణాలు స్పేస్ స్టేషన్‌లోని యంత్రాల్లోకి వెళ్లితే ఇబ్బందులు వస్తాయి.

సోడా, కూల్ డ్రింగ్స్‌ల తీరు అంతరిక్షంలో భిన్నంగా ఉంటుంది. కాబట్టి వీటినీ వ్యోమగాములు అంతరిక్షంలో తాగకూడదు

వ్యోమగాలు అంతరిక్షంలో మద్యం అస్సలు సేవించకూడదు

డీహైడ్రేటెడ్ ఐస్ క్రీమ్ నుంచి వెలువడే సూక్ష్మకణాలు వివిధ పరికరాల్లోకి వెళ్లి పాడు చేయగలవు, కాబట్టి ఇవీ నిషిద్ధమే