ఎదిగే క్రమంలో పిల్లలకు పోషకాహార లోపం అస్సలు ఉండకూడదు. ఇక చిన్నారుల బ్రెయిన్ పవర్ పెంచే ఫుడ్స్ గురించి తెలుసుకోవడం అత్యవసరం

ఫ్యాటీ ఫిష్ వీటిల్లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ పెంచుతుంది. దీంతో  జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

బెర్రీస్ వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్.. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తొలగించి కొత్త విషయాల్ని అర్థం చేసుకునే శక్తిని పెంచుతాయి. 

విత్తనాలు, గింజలు వీటిల్లోని విటమిన్- ఈ, ఫోలేట్ వంటివి మెదడు అభివృద్ధికి ఎంతో అవసరం

తృణధాన్యాలు ఇవి చిన్నారుల మెదడుకు కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి. వీటిల్లోని విటమిన్-బీ న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరు మెరుగయ్యేందుకు కీలకం

ఆకు కూరల్లో ఉండే వీటిమిన్ ఏ, సీ, కే కూడా మెదడు సామర్థ్యాన్ని ఇనుమడింపచేస్తాయి.

కోడి గుడ్లు కోడి గుడ్లలో ఉండే కోలిన్ మెదడు అభివృద్ధికి, కాగ్నిటివ్ సామర్థ్యాలు పెరిగేందుకు చాలా తోడ్పాటునందిస్తుంది. 

గ్రీక్ యోగర్ట్ దీంట్లో ఉండే ప్రొటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని అధ్యయనాల్లో రుజువైంది.