చేపలు మంచి పౌష్టికాహారం. కానీ, శరీరానికి కావాల్సినంత కాల్షియం అందించేందుకు చేపలకంటే మెరుగైన ఆహారాలు ఉన్నాయి! అవేంటంటే..

నువ్వుల్లో కావాల్సినంత కాల్షియం ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ నువ్వులతో 88 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది

చియా గింజల్లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక ఔన్స్ గింజల్లో సుమారు 179 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది

కాల్షియం కోసం బాదం పప్పులూ తినొచ్చు. కప్పు బాదం పప్పులతో 92 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది

సోయా బీన్స్‌తో చేసే టోఫూ కాల్షియం బోలెడంత ఉంటుంది. అర కప్పు టోఫూ తింటే 350 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.

అరకప్పు కాలే కూరగాయలోనూ 94 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. దీన్నీ ఓసారి ట్రై చేయచ్చు

కప్పు నిండా ఉడకబెట్టిన బ్రోకలీలో 62 గ్రాముల కాల్షియం ఉంటుంది. కాల్షియం కోసం దీన్ని తినొచ్చు

ఎండబెట్టిన అంజీర పండులోనూ కాల్షియం అత్యధికంగా ఉంటుంది. అరకప్పు అంజీర తింటే ఏకంగా 121 మిల్లీగ్రాముల కాల్షియం దొరుకుతుంది

ఒక్క నారింజలో 52 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇది రుచిగా కూడా ఉండటం మరో బెనిఫిట్

పాల ఉత్పత్తులు అన్నిటిలో మనకు కావాల్సినంత కాల్షియం లభిస్తుంది.