మద్యం తాగిన తర్వాత ఇవి తింటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి..!
అవకాడోలో ఉండే ఆరోగ్యకర కొవ్వులు శరీరంపై ఆల్కహాల్ ప్రభావాన్ని నెమ్మదింపజేస్తాయి. మద్యం వల్ల బ్లడ్ షుగర్ స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోకుండా కాపాడతాయి.
బాదం, వాల్‌నట్స్, పిస్తా మొదలైన ఈ-విటమిన్ ఎక్కువగా ఉండే నట్స్ కాలేయానికి రక్షణగా నిలుస్తాయి. కాలేయంపై మద్యం దుష్ర్పభావాన్ని కొంత వరకు తగ్గిస్తాయి.
మద్యం తీసుకోవడం వల్ల కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుందనే సంగతి తెలిసిందే. మద్యపానం తర్వాత బచ్చలికూర, కాలే, తోటకూరతో చేసిన ఆహార పదార్థాలు తింటే కాలేయంపై దుష్ప్రభావం కొంత వరకు తగ్గుతుంది.
సాల్మన్ ఫిష్ వంటి ఒమేగా-3-ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తాయి.
మద్యపానం తర్వాత క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆల్కహాల్ వల్ల తలెత్తే హైపోగ్లైసేమియా నుంచి శరీరాన్ని కాపాడడంతో ఇవి సహాయపడతాయి.
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, గ్రీన్ బెర్రీ వంటి బెర్రీ ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి ఆల్కహాల్ వల్ల తలెత్తే దీర్ఘకాలిక సమస్యలను కొంత వరకు నియంత్రిస్తాయి.
మద్యం సేవించేటపుడు వేపుడు పదార్థాలు కాకుండా క్యారెట్, జీడిపప్పు లేదా ఇతర హెల్దీ స్నాక్స్‌ను మాత్రమే తీసుకోవాలి. లేకపోతే బ్లడ్‌లో చక్కెర స్థాయులు విపరీతంగా పెరిగిపోతాయి.
గ్రీక్ యోగర్ట్‌లో ప్రోటీన్స్, ప్రో బయోటిక్స్ హెచ్చు స్థాయిలో ఉంటాయి. ఆల్కహాల్ వల్ల తలెత్తే జీర్ణ సంబంధం సమస్యల నుంచి గ్రీక్ యోగర్ట్ కాపాడుతుంది.