ముఖ సౌందర్యం కోసం ఫేషియల్స్‌ వేసుకోవడం మనకు అలవాటే  ఫేస్‌ పీల్స్‌ కూడా మేలు  చేస్తాయంటున్నారు నిపుణులు

ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి వేసుకొనే పీల్స్‌తోనూ ముఖ సౌందర్యం లభిస్తుంది ముఖ సౌందర్యనికి కావల్సిన ఇంటి పదర్ధాలు 

అరకప్పు కీరాదోస గుజ్జు తీసుకుని అందులో గుడ్డులోని తెల్లసొన చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి

గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోని ఇందులో ఉన్న కీరాదోస.. పిగ్మెంటేషన్‌ సమస్యను తగ్గింస్తుంది ముడతలు, గీతల్ని కూడా దూరం చేస్తుంది

పైనాపిల్ ముక్కలు అరకప్పు,  బొప్పాయి ముక్కలు పావు కప్పు తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. తర్వాత అందులో అరచెంచా తేనె వేసి బాగా కలపాలి

ముఖానికి మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి

తర్వాత గోరువెచ్చని నీటితో ఓకసారి,చల్లని నీటితో   మరోసారి ముఖాన్ని శుభ్రం చేసుకుని పొడి వస్త్రంతో తుడుచుకోవాలి ఇలా తరచూ చేయడం వల్ల ఫలితం ఉంటుంది

పాలల్లో కొద్దిగా ఓట్స్‌ వేసి ఉడికించి తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కలపాలి మిశ్రమం కాస్త చల్లబడిన తర్వాత బ్లాక్‌హెడ్స్‌ ఉన్న చోట అప్లై చేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి