గ్రీన్ టీ vs బ్లాక్ కాఫీ: రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? 

సాధారణ టీ లేదా కాఫీ కంటే గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే అయినా వీటిల్లో కొన్ని తేడాలు ఉన్నాయి.

కామెల్లియా సైనెన్సిస్ మొక్క ఆకుల నుంచి గ్రీన్ టీ తయారు చేస్తారు. ఇందులో క్యాటెచిన్ మెండుగా ఉంటుంది. ఇది తాగితే గుండె పని తీరు మెరుగు పడుతుంది.

గ్రీన్ టీలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల బ్రెయిన్ యాక్టివ్‌గా పని చేస్తుంది. అలాగే మానసిక స్థితి మెరుగుపడుతుంది.

గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజమ్ రేటు మెరుగుపడుతుంది. అలాగే పలు ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.

కాల్చిన కాఫీ గింజల నుంచి బ్లాక్ కాఫీని తయారు చేస్తారు. బ్లాక్ కాఫీలో ముఖ్యమైన పదార్ధం కెఫిన్. ఇది అలసటను తగ్గిస్తుంది.

మానసిక స్థితిని రిఫ్రెష్ చేయడానికి బ్లాక్ కాఫీ పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తాగితే నాడీ సంబంధిత వ్యాధులు , కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీవక్రియను మెరుగుపరచడంతో పాటు ఆకలిని తగ్గించడంలో బ్లాక్ కాఫీ బాగా పని చేస్తుంది. ఇది మీ బరువును అదుపులో ఉంచుతుంది.

బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ పుష్కలంగా యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ మధ్య ప్రధాన వ్యత్యాసం కెఫిన్. బ్లాక్ కాఫీలో ఇది ఎక్కువ.

బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ రెండూ ఆరోగ్యానికి మంచివే అయినా.. గ్రీన్ టీ ఎక్కువ ప్రభావంతమైనది. మెటబాలిజమ్‌ను మెరుగుపరచడంలో, గ్లూకోజ్ శోషణంలో గ్రీన్ టీ మెరుగ్గా పని చేస్తుంది.