వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెంచితే నష్టాలు తప్పవు..!

ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే చాలు.. చాలామంది మొక్కలు పెంచడానికి ఇష్టపడతారు. అయితే కొన్ని మొక్కలు ఇంట్లో పెంచితే వాస్తు ప్రకారం చాలా నష్టాలు చేకూరుస్తాయి.

బోన్సాయ్.. బోన్సాయ్ మొక్కలు ఎదుగుదల కుంగిపోవడాన్ని సూచిస్తాయట. ఆర్థికంగానూ, కుటుంబ పరంగానూ ఎదుగుదల ఉండదట.

కాక్టస్.. కాక్టస్ మొక్కలు చాలా అందంగా ఉంటాయి. మొక్కల ముళ్లు ద్వేషం, నొప్పి, ప్రతికూలతను ప్రేరేపిస్తాయట.  వీటిని ఇంట్లో పెంచకపోవడమే మంచిది.

చింత.. వాస్తు ప్రకారం చింత మొక్క ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఇది పెరిగే చోట ప్రతికూల శక్తిని విడుదల చేస్తుందట. అనారోగ్యాలు కలుగుతాయని అంటారు.

పత్తి.. ఇంట్లో పత్తి మొక్కను పెంచితే ఆర్థిక ఇబ్బందులు తప్పవట. శాస్త్రీయ కారణంతో చూస్తే పత్తి విత్తనాలు సున్నితమైన వ్యక్తులలో శ్వాస సమస్యలను, ఆస్త్మాను కలిగిస్తాయట.

తుమ్మ.. తుమ్మ చెట్లు ఇంటి ఆవరణలో ఉంటే అది అనారోగ్యాన్ని,  కుటుంబ సభ్యుల మధ్య వివాదాలను తీసుకొస్తుందట.

గోరింట.. గోరింటను శుభప్రదంగా భావించినప్పటికీ గోరింట వాసన అన్ని రకాల శక్తులను ఆకర్షిస్తుందట.  ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉండాలంటే గోరింట పెంచకపోవడం మంచిది.

రావి.. రావిచెట్టు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి, కుటుంబంలో స్తబ్దత ఏర్పడుతుందట.వీటి వేర్లు బలంగా ఉంటాయి.  ఇళ్లను సునాయానంగా బలహీనం చేస్తాయి. 

దొండకాయ.. దొండకాయ మొక్కను ఇంట్లో పెంచకూడదని చెబుతారు. ఇది చాలా వేగంగా పాకుతుంది.  ఇది ఇంటి ప్రాంతంలో సానుకూల శక్తిని లాగేస్తుందని చెబుతారు.