ఇళ్లల్లో కొన్ని మొక్కలు పెంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వేప ఆకులు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అలాగే మలేరియాను కూడా నియంత్రించవచ్చు.
తులసి ఆకులు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. అలాగే తలనొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
తిప్పతీగ మొక్క ఆకులు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటూ చర్మ అలర్జీలు తగ్గుతాయి.
కలబంద రసం తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గడంతో పాటూ జుట్టు, చర్మం అందంగా మారుతుంది.
మర్రి ఆకులు డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
అశ్వగంధ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటూ ఎముకలను బలంగా మారుస్తుంది.
మారేడు ఆకులు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సాయం చేస్తాయి.
మందార ఆకులు కడుపునొప్పిని తగ్గించడంతో పాటూ వాపును కూడా తగ్గిస్తాయి.
రావి ఆకులు తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దంతాలకూ దివ్యౌషధంలా పని చేస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోస మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
కిచెన్ ఫర్నిచర్లో ఇవి ఉండేలా చూసుకోండి..
రాత్రి పూట, వికసించే అందమైన పువ్వులు ఇవే!
పిల్లలు గొడవపడకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ప్యారీస్ ఫ్యాషన్వీక్లో ఆలియా అదిరిపోయే డెబ్యూ