ఆధునిక జీవితంలో ఒత్తిడి తప్పదు. అయితే, కొన్ని అలవాట్లతో ఎంతటి ఒత్తిడైనా మటుమాయమవుతుంది. అవేంటంటే..
ధ్యానంతో భావోద్వేగ నియంత్రణ సామర్థ్యం పెరిగి ఒత్తిడి తగ్గుతుంది
క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేస్తే ఎండార్ఫిన్లు విడుదులై, కార్టిసాల్ స్థాయిలు తగ్గి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
పోషకాహారం మెదడు పనితీరును మెరుగుపరిచి ఒత్తిడి నియంత్రణలో తోడ్పాటునందిస్తుంది
తగినంత నిద్రపోతే భావోద్వేగాలపై నియంత్రణ, మెదడు సామర్థ్యం ఇనుమడించి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి
పనులను ప్రాధాన్య క్రమంలో చేయడం, వాస్తవిక లక్ష్యాలు ఎంచుకోవడం, సమయపాలన వంటివి పాటిస్తే ఒత్తిడిని జయించొచ్చు
స్నేహితులు, బంధువులు, జీవిత భాగస్వాములతో కష్టసుఖాలు పంచుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.
మనసంతా కేంద్రీకరించి చేసే బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు కూడా ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి
Related Web Stories
కీళ్ల నొప్పులను తగ్గించే ఆహారాలు ఇవే..!
ఆలూ పరోటా తినడం వల్ల కలిగే 15 ఆరోగ్య ప్రయోజనాలు..
బీర్ తాగితే కలిగే సర్ప్రైజింగ్ బెనిఫిట్స్ ఇవే!
ఈ జంతువుల వల్ల కూడా రేబిస్ వస్తుందని తెలుసా..?