లైఫ్‌లో ఆర్థిక భద్రత సాధించాలంటే సంపాదనతో పాటు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

ఖర్చుల విషయంలో ఏమాత్రం అలసత్వమున్నా ఆస్తి మొత్తం కర్పూరంలా ఖర్చైపోతుంది. 

ఐడు చెడ్డ అలవాట్ల కారణంగా ప్రజలు తమ సంపదను కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. 

ఆడంబరాలకు పోయి ఆదాయానికి మించి ఖర్చులు చేస్తే సంపద మొత్తం హరించుకుపోతుంది

భవిష్యత్ అవసరాల కోసం డబ్బును పెట్టుబడిగా పెట్టకపోతే సంపదంతా వృధాగా ఖర్చైపోతుంది

టైంకు అప్పులు తీర్చకపోతే వడ్డీల రూపంలో సంపద మాయం అవుతుంది

రిటైర్మెంట్‌ కోసం ఆర్థికప్రణాళిక లేకపోతే చివరి రోజుల్లో జేబులు ఖాళీ అయిపోతాయి

ఇష్టారీతిన షాపింగ్ చేయడం కూడా ఆర్థిక భద్రతకు గొడ్డలి పెట్టు.

ఈ అలవాట్లు ఉన్న వారు తక్షణం తమ తీరు మార్చుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్స్ హెచ్చరిస్తున్నారు.